ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొంతమంది కాస్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా గంటా శ్రీనివాస రావు గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీ లోకి వెళ్తారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే ఆయన పార్టీ మారవచ్చని రాజకీయ వర్గాలు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి వెళ్లడం లేదని ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం బీజేపీలోకి  వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బిజెపిలోకి వస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఆయనతో చర్చలు కూడా జరిపిందని బిజెపి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఆయనకు హామీ ఇచ్చారని అంటున్నారు. ఆయన బలమైన నేత కావడంతో ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

త్వరలోనే గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు అడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఎలాంటి అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయినా సరే బిజెపి మాత్రం బలమైన నేతలు తమ వైపు తిప్పుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళుతుంది. మరి గంటా శ్రీనివాసరావు బీజేపీ లోకి వెళ్తారా లేదా అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: