ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం పెట్టుకున్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ఆక‌స్మికంగా నిలు పుద‌ల చేసుకున్నారు. శుక్ర‌వారం రాత్రి అనూహ్యంగా దీనికి సంబంధించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మీ డియాకు స‌మాచారం చేర‌వేశారు. అయితే.. దీనిపై సోష‌ల్ మీడియాలోను, ఓవ‌ర్గం ప్ర‌ధాన మీడియాలోను.. అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి దీనిలో నిజం ఏంటి? ఎందుకు ఇలా జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏటా.. ప్ర‌తి ఆరుమాసాల‌కు ఒక‌సారి.. ముఖ్య‌మంత్రుల‌తో భేటీ అవుతుంది.

దీనికి ఒక్కొక్క‌సారి ఒక విష‌యం తీసుకుంటుంది. గ‌డిచిన నాలుగేళ్లుగా.. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో కేంద్ర హోం శాఖ భేటీ అవుతోంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది కూడా భేటీ నిర్వ‌హించ నుంది. ఈ నెల 26న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనికి న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌లకు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే.. కేసీఆర్ ఇప్ప‌టికే ఢిల్లీ కి చేరుకున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ముందు.. రెడీ అయ్యారు. షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్నా రు.కానీ, ఇంత‌లోనే.. శుక్ర‌వారం రాత్రి. ఆయ‌న ఢిల్లీ టూర్ ఆపుకొంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీనికి ప్ర‌భుత్వం చెప్పిన కార‌ణం.. సీఎం జ‌గ‌న్ దైనందిన చ‌ర్య‌ల్లో భాగంగా.. ఉద‌యం వ్యాయామం చేస్తున్న‌ప్పుడు.. కాలు బెణికింద‌ని.. ఇది సాయంత్రానికి వాచి.. తీవ్ర‌మైన నొప్పిగా మారింద‌ని.. దీంతో వైద్యులు ఆయ‌న‌కు బెడ్ రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించార‌ని.. అందుకే ఢిల్లీ ప‌ర్య‌ట‌న నిలుపుద‌ల చేసుకున్నార‌ని.. వివ‌రించింది.

కానీ, ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియాలో మాత్రం దీనికి భిన్న‌మైన క‌థ‌నం వ‌చ్చింది. ఢిల్లీలో కొంద‌రు కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్స్ అడిగార‌ని.. అయితే.. జ‌గ‌న్‌తో మాట్లాడేందుకు వారు ఇష్ట‌ప‌డ‌లేద‌ని.. అందుకే డిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నార‌ని.. రాసుకొచ్చారు. అయితే.. ఈ వార్త‌ను ప్ర‌భుత్వం ఖండించ‌లేదు. దీనిపై వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఇది నిజ‌మా..?  లేక‌.. జ‌గ‌న్‌కు కాలు బెణికిన మాట వాస్త‌వ‌మా? అనేది.. ఆస‌క్తిగా మారింది. అయితే.. గ‌తంలోనూ ఢిల్లీకి వెళ్లిన సీఎం.. అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోయినా.. వెనుదిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సో.. ఓ వ‌ర్గం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంలో ప‌స‌లేద‌ని అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: