తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరిని చెప్పవచ్చు.. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇలాంటి క్రేజ్ తోనే పలు రకాల ఈవెంట్లలో ఫంక్షన్లలో కనిపిస్తున్న హైపర్ ఆది ఏకంగా సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ మానేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో కనిపిస్తూ ఉన్నారు. ఇక పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నిర్వహించే పలు కార్యక్రమాలలో కూడా హైపర్ ఆది హంగామా ఉంటుంది.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఆకట్టుకున్న హైపర్ ఆది ఇప్పుడు తాజాగా ఒక ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ ఒక అమ్మాయిని సైతం అందరికీ పరిచయం చేస్తున్నారు.. అయితే ఇదంతా స్కిట్ లో భాగంగానే అన్నట్లుగా సమాచారం.. ఇటీవల కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో సైతం వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది తన భార్య అంటూ ఒక ఆఫ్రికా అమ్మాయిని తీసుకువచ్చి అక్కడ పరిచయం చేశారు..


ఆమె నేను ఒత్తిడికి గురయ్యాను అంటే చాలు హాగ్ ఇస్తుంది అంటూ ఆమె చేత హగ్గు ఇప్పించుకున్నట్లుగా చూపించారు.. ఇది చూసిన చాలా మంది బుల్లితెర ప్రేక్షకులు ఏంటి హైపర్ ఆది ఇలా రోజురోజుకి దిగజారిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఛాన్స్ దొరికింది కదా అంటూ మాటిమాటికి ఒత్తిడి గురయ్యాను అంటూ ఆమెతో హగ్గు తీసుకుంటున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు.. హైపర్ ఆది కామెడీ పండిస్తున్నప్పటికీ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఇలాంటి స్కిట్లను చూస్తూ ఉంటారు కనుక వారికి మాత్రం ఇలాంటి సన్నివేశాలు నచ్చలేదని బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: