
ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టివేస్తే ఆధారాలు ఉన్నాయని నమ్మినట్లు. ఆ సందర్భంలో స్థానిక కోర్టులు బెయిల్ మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. ఆ సమయంలో బెయిల్ కోసం మళ్లీ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి ఆర్థిక పర అంశాల్లో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి సంశయిస్తుంది. ప్రాథమిక ఆధారాలు లేకుంటే తప్ప బెయిల్ ఇవ్వదు.
ఇప్పటికే చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ లో రెండు పీటీ వారెంట్లు జారీ చేశారు. ఇప్పుడు అమరావతికి సంబంధించిన ఇంతకుముందు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న స్టేలు, 41.ఏ నోటీసుల్లో విచారణలో ఉన్న వాటి అన్నింటల్లో అరెస్టు చేస్తారా అనేది వేచి చూడాలి. రాజధాని ప్రాంతం స్టార్టప్ అభివృద్ధి పేరుతో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలకు ప్రభుత్వం తెరతీసింది. సింగపూర్ కంపెనీల కోసం చట్టాలను సవరించింది. పాత జీవోను సవరిస్తూ మరో జీవోను జారీ చేసింది.
అసెండాస్, సెంబ్రిడ్జ్, సెంస్కార్బ్ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి స్విస్ ఛాలెంజ్లో పాల్గొన్నాయి. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీసుకున్న 1091 ఎకరాలను వీరికి అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్తకంపెనీలతో ఒప్పందం ఎలా చేసుకుంటారని జీవో 179 కి ఇది విరుద్ధమని అప్పట్లో సాక్షిలో ఈ వార్త ప్రచురితం అయింది. ఇప్పుడు దానిపై కూడా దర్యాప్తు జరుగుతుంది అనేది కీలకాంశం.