
అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ కి ఉన్న సగభాగం గేట్లను స్వాధీనం చేసుకుని… తద్వారా నీటి విడుదల చేసుకుంది. తెలంగాణ ప్రాంత పోలీసులు నీళ్లను ఆపేసినా.. కరెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నా.. ప్రత్యామ్నాయ వనరులతో సాయంతో దాదాపు మూడు జిల్లాలకు నీళ్లను విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థించుకుంటుంది. అయితే దీని వెనక వేరే కారణాలు ఉన్నాయని అర్థం అవుతుంది. జగన్ వ్యూహం ఫలించింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా ఆ నిర్ణయాన్ని కేంద్ర పరిధిలో ఉంచడం. ఈ లోపు నీటి విడుదల కొనసాగింది. ఏపీకి కావాల్సిన నీరు ఆ ప్రాంత జిల్లాలకు చేరుతుంది. ఇదే సమయంలో కేంద్రం సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ అంశాల ద్వారా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శాంతి కుమారి మాత్రం హాజరుకాలేదు. సమావేశ తేదీని మార్చాలని ఆమె కోరారు.
దీంతో సమావేశాన్ని ఆరో తేదికి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. అన్ని అంశాలు కూలంకుషంగా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ఇచ్చిన నీటి విడుదల ఇండెంట్ మీద కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలకు సంబందించిన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. అప్పటి దాకా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని ఈ సందర్భంగా కోరారు. అయితే తెలంగాణ విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తాగు నీటి అవసరాలకు పలు సార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందించలేదని అందుకే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయిని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.