వైద్యులు కలియుగదైవంఅని చెబుతూ ఉంటారు..  కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో  అయితే వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అనే విషయం తెలిసిందే. అటు దేవాలయంలో ఉండే దేవుడైన కోరగానే వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ  తెల్లకోటు వేసుకున్న వైద్యులు మాత్రం అడక్కుండానే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా  ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలను రక్షించారు. అయితే వైద్యులు తమ వద్దకు ఎవరైనా సమస్యతో వస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఏదో ఒకటి చేసి ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు నిలబెట్టడానికి వినూత్నమైన ప్రయోగాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఇప్పటివరకు ఒక మనిషి గుండె ను మరో మనిషికి అమర్చి ప్రాణం నిలబెట్టడం లాంటివి చూసాం. అంతేకాకుండా  వేరొకరికి సంబంధించిన వివిధ అవయవాలను మరొకరికి అమర్చడం లాంటివి కూడా జరిగింది. అయితే ఇక్కడ మాత్రం వైద్యులు అద్భుతం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక మహిళకు మూత్రపిండాలు చెడిపోయాయి. ఈ క్రమంలోనే ఆమెకు కొత్త కిడ్నీలు అమర్చి ప్రాణం నిలబెట్టారు.



 ఇలా కొత్త కిడ్నీలు అమర్చి ప్రాణం నిలబెట్టడంలో కొత్త ఏముంది అని అంటారా.. అయితే సదరు మహిళకు అమర్చింది మరో మనిషి కిడ్నీలు కాదు ఏకంగా ఒక పంది మూత్రపిండాలు. మూత్రపిండాలు చెడిపోయిన ఆ మహిళకు కిడ్నీలు దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె ప్రాణం నిలబెట్టాలి అనుకున్న వైద్యులు ఏకంగా పంది మూత్రపిండాలను తీసుకుని వాటిని ఆమెకు మార్పిడి చేశారు. ఇక ఈ ఆపరేషన్ చేసేందుకు మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు వైద్యులు  ఇక ఈ ఆపరేషన్ తర్వాత బాధిత మహిళ కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: