
ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు.అదే విధంగా దూసుకు పోయింది.ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నిధి జోరుకు అడ్డంకులే లేకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ విజయం అనంతరం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు జయం రవి, శింబు సరసన నటించారు. ఇటీవల తెలుగులో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘హీరో’ సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది..
ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన చేశారు. అంతేకాదు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలోను క్రేజీ ఆఫర్ దక్కించుకుంది నిధి అగర్వాల్. ఈ అమ్మడు ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన ఆఫర్ అందుకుంది అనే సరికి అందరు షాక్‌లో ఉండిపోయారు. నిధి సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ చేసే రచ్చ మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. ఈ అమ్మడి క్యూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.