
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ హిట్ 3 ’. మరి సాలిడ్ హైప్ నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమాకు రాని బజ్ వచ్చేసింది. ఈ సినిమా పై హైప్ మామూలుగా లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తోన్న హిట్ 3 సినిమా .. నేచురల్ స్టార్ నాని కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే ట్రెండ్ ని కొనసాగించింది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే హిట్ 3కు మంచి టాక్ కూడా రావడంతో డే 1 వరల్డ్ వైడ్ గా అందుకునే అంచనా వసూళ్ల గురించి కూడా ట్రెండ్ నడుస్తోంది.
ఈ సినిమా నాని కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇదివరకు దసరా సినిమా 38 కోట్లతో హైయెస్ట్ నెంబర్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు హిట్ 3 సినిమా దసరా రికార్డును బ్రేక్ చేసి 40 కోట్ల మేర వసూళ్లు కొల్లగొడుతుందని అంటున్నారు. ఇక ఏపీలో ఇచ్చిన టిక్కెట్ రేట్ల హైక్ అనేది హిట్ 3 సినిమాకు మంచి ప్లస్ అయ్యిందని అంటున్నారు. మరి డే 1 కి అధికారికంగా హిట్ 3 ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు