కొన్ని సినిమాలకు విడుదల అయిన తర్వాత మంచి టాక్ వచ్చినట్లయితే అలాంటి మూవీలకి చాలా రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలకు విడుదల అయిన తర్వాత మంచి టాక్ రానట్లయితే ఆ తర్వాత వారంలో విడుదల అయ్యే సినిమాలకు ఒక వేళ మంచి టాక్ వస్తే అంతకు ముందు వారం విడుదల అయిన సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఇకపోతే పోయిన వారం ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన సారంగపాణి జాతకం అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు పర్వాలేదు అనే స్థాయి టాక్ మాత్రమే వచ్చింది. దానితో ఈ మూవీ కి యావరేజ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ రోజు అనగా మే 1 వ తేదీన నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమా విడుదల అయింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి టాక్ ను తెచ్చుకున్నట్లైతే సారంగపాణి జాతకం కలెక్షన్లు పూర్తిగా తగ్గి అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు సారంగపాణి జాతకం సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్సా ఫీస్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 75 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 88 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.63 కోట్ల షేర్ ... 3.15 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 38 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 5 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.01 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 4.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 2.5 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: