తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నాని ఈ మధ్య కాలంలో వరస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. నాని వరుసగా దసరా , హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా మూడు మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా నాని "హిట్ ది థర్డ్ కేస్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో నాని హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇకపోతే నాని నటించిన అనేక సినిమాలకు యు ఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లు దక్కిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నాని నటించిన ఎన్నో సినిమాలు యూ ఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజృంభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే హిట్ ది థర్డ్ కేస్ మూవీ ప్రీమియర్స్ తోనే యు.ఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రీతిలో జోష్ చూపించడం మొదలు పెట్టింది. అసలు విషయం లోకి వెళితే ... హిట్ ది థర్డ్ కేస్ మూవీ ప్రీమియర్స్ తోనే యూఎస్ లో ఏకంగా 8 లక్షల డాలర్స్ మార్క్ ని అందుకుంది.

ఇక ఈ మూవీ యు ఎస్ లో డే 1 తో కలిపితే ఈజీగా 1 మిలియన్ మార్క్ ని హిట్ 3 కొట్టేస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీనితో నాని మరోసారి హిట్ ది థర్డ్ కేస్ మూవీ తో యుఎస్ మార్కెట్ లో తన జోష్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి మంచి టాక్ కూడా వచ్చింది. దానితో ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా యూఎస్ లో మంచి కలెక్షన్లను రాబడుతుంది అని కూడా చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: