
హీరోయిన్ సమంత అంటే నిర్మాత సురేష్ బాబుకు ఎంతో అభిమానం .. తమ కుటుంబంలో ఒక సభ్యురాలు అయినప్పుడు సమంత అంటే ఎంతో గౌరవం .. అభిమానం చూపించారు. తన మేనల్లుడికి భార్య అయినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డారు. అదంతా గతం ఇక సురేష్ బాబు ఇంట్లో పెళ్లి అయినప్పుడు సమంత అన్ని తానే వ్యవహరించారు .. రానా కు కూడా సమంత అంటే చాలా అభిమానం .. సమంతతో సురేష్ బాబు ఓ బేబీ అని సినిమా కూడా తీశారు. ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి అన్నట్టు సాగిపోతున్నారు. ఇలాంటి టైంలో సమంత నిర్మాతగా మామరి శుభం అనే చిన్న సినిమా తీశారు. జస్ట్ ఆరు కోట్ల బడ్జెట్ పెట్టారు .. సినిమా రిలీజ్ కాకముందే ఓ మూడు కోట్ల వరకు లాభం చేసుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదల చేయాలి. నైజాం ఏరియాను మైత్రి మూవీస్ సంస్థ ముందుకు వచ్చి కోటిన్నరకు కాస్త అటు ఇటుగా కొనుగోలు చేసింది. ఇది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సిస్టమ్ మీద మైత్రీ తీసేసుకుంది.
ఇక ఏపీ - సీడెడ్ ఏరియాలో ఎవరు కొంటారు ఎవరు పంపిణీ చేస్తారు ? అన్న సందిగ్ధం నడిచింది. అయితే ఈ రెండు ఏరియాలో తాను శుభం సినిమాను పంపిణీ చేసి పెడతా అంటూ సురేష్ బాబు ముందుకు వచ్చారు. దాంతో సమంత తన సినిమాను సురేష్ బాబు చేతుల్లో పెట్టారు. ఇటు మైత్రి మూవీస్ .. అటు సురేష్ బాబు కలిసి శుభం సినిమాకు అదిరిపోయే రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నట్టే అనుకోవాలి. ఏది ఏమైనా సమంత కు సురేష్ బాబు మామూలు సాయం చేయలేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు