ఒకప్పుడు వైసిపి ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మాటకు వస్తే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎంపీగా ఉండి రఘురామ కృష్ణంరాజు జగన్ పై ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా .. ఎన్ని కేసులు పెట్టిన నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకున్న రఘురామ మాత్రం ఢిల్లీ నుంచి తన పోరాటం కొనసాగించారు. బిజెపి జాతీయ నాయకులతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని రఘురామ జగన్ తో పాటు వైసిపి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఇక ఎన్నికలకు ముందు రఘురామా టిడిపి కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి ఉండే ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా రఘురామ ఎమ్మెల్యేగా ఉన్న ఉండి నియోజకవర్గంలో ఇటీవల పెద్ద సంఖ్యలో పేదల నివాసాలను కూల్చివేశారు.
దీనిపై సిపిఎం రాష్ట్ర నాయకత్వం పోరుబాట కొనసాగిస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు రఘురామ పై ఘాటు విమర్శలు చేశారు. కౌంటర్గా ఆయనపై రఘురామ దూషణకు దిగారు .. కనీస గౌరవం లేకుండా నోరూపారేసుకున్నారు. ఇంత జరుగుతున్న పేదలకు అండగా నిలవలసిన బాధ్యతను వైసిపి విస్మరించింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన జగన్ వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మదునూరు ప్రసాద్ రాజు కు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. రఘురామ పేదల ఇల్లు పడగొట్టిస్తుంటే మీరేం చేస్తున్నారని జగన్ నిలదీసినట్టు సమాచారం. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించడంతో పాటు ?ఇప్పటికైనా నిద్ర మేల్కొని ఉండి నియోజకవర్గంలో పేదలకు అండగా నిలవాలని ఆదేశించినట్టు సమాచారం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు