కొంతమంది హీరో హీరోయిన్లకు పెళ్లి తర్వాత కలిసి వస్తే మరి కొంత మందికి పెళ్లికి ముందే కలిసి వస్తుంది. అయితే పెళ్లయ్యాక కలిసి వస్తే ఇంటికి వచ్చిన కోడలు అదృష్టవంతురాలు అని, భార్య గొప్పది అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఒకవేళ పెళ్లయ్యాక వాళ్ళ సినీ కెరియర్ అటు ఇటుగా ఉంటే మాత్రం ఇండస్ట్రీలో వచ్చే విమర్శలను ఎదుర్కోలేము. వచ్చీ రావడంతోనే ఆ హీరో సినీ కెరీర్ నాశనం చేసింది.ఆమె అడుగు పెట్టడం వల్లే ఇలా జరిగింది అంటూ ఇలా ఎన్నో రూమర్లు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా కొంతమంది బీటౌన్ జనాలు అలాగే మాట్లాడుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానిని పెళ్లాడాక జాకీ బాగ్నాని ఉన్న ఆస్తులన్ని అమ్ముకుంటున్నారట. 

రకుల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన పెళ్లి తర్వాత ఉన్న ఆస్తులు అమ్మేసుకోవడంతో ఆ నిందంతా రకుల్ మీదకే నెట్టేస్తున్నారు కొంతమంది జనాలు. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పటినుండి జాకీ భగ్నాని ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రచారంపై స్పందించారు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని.ఆయన మాట్లాడుతూ.. నేను టైగర్ ష్రాఫ్,అక్షయ్ కుమార్ లు కలిసి నటించిన బడే మియా చోటే మియా సినిమా తీసి భారీగా నష్టపోయాను. ఈ సినిమా కారణంగా కొన్ని ఆస్తులు అమ్ముకున్నా.. మరికొన్ని ఆస్తులు తాకట్టు పెట్టా.. కానీ ఇంత చేసినా కూడా నా బాధను ఎవరూ పట్టించుకోలేరు.

అయితే మేం తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని నేను అనుకుంటున్నా. కానీ ప్రేక్షకుల చూసే విధానాన్ని తప్పు పట్టడం లేదు.వాళ్ళు ఎప్పటికీ కరెక్టే..ప్రేక్షకుడిని నేను తప్పు పట్టడం లేదు. వారి నిర్ణయం ఎన్నటికీ తప్పు కాదు.కానీ ప్రేక్షకులు ఆదరించేలా మేము సినిమా తీయలేదు అని అనుకుంటున్నాను. అంటూ సినిమా కారణంగా వచ్చినా నష్టాల గురించి స్పందించారు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని.. ప్రస్తుతం జాకీ భగ్నాని మాట్లాడిన మాటలు బీటౌన్ లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు జాకీ భగ్నాని ఆస్తులు తాకట్టు పెట్టడాన్ని రకుల్ ప్రీత్ సింగ్ మీదికి నెట్టేస్తున్నారు. ఆమె ఇంట్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుండి వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: