చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ హీరో నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవడం విశేషం. చిరంజీవి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమా త్వరలోనే అభిమానుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా అనంతరం చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాను తీయబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్య రాజేష్ లను అనుకుంటున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను హీరోయిన్ నయనతారకు వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైన కు వెళ్లనుంది.

ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ కేతిక శర్మను అనుకుంటున్నారట. దీనికోసం ఈ బ్యూటీని సంప్రదించగా ఆమె స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఓకే చెప్పిందట. కేతిక శర్మ ఐటమ్ సాంగ్ చేస్తే ఈ సినిమాకి ప్లేస్ అవుతుందని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: