ఈరోజు నుంచి కొత్త రూల్స్ ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్, ఏటీఎం ఇలా కొన్ని వాటిలలో మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతినెలా కూడా ఎల్పీజీ గ్యాస్ తో సహా పలు రకాల మార్పులను చేస్తూ ఉన్నారు. ఇది సామాన్యుడికి పెద్ద భారంగా మారబోతున్నది. మరి ఈరోజు నుంచి మార్పులు చోటు చేసుకునే వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ఏటీఎంల నగదు తీసుకోవడానికి ఇక పైన వినియోగదారులకు చార్జీ మోత మోగించేలా ఆర్బిఐ ప్రకటించింది. 21 రూపాయలు ఉన్న దానిని 23 రూపాయలకు పెంచారు. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకుని చార్జీలు 6 నుంచి7 రూపాయలకు పెంచింది. ఏటీఎంలో 5 సార్లు, ఇతర బ్యాంకులలో మూడుసార్లు ఉచితంగా లావాదేవులు చేసుకోవచ్చు. ఇక అంతకుమించి చేస్తే చార్జెస్ అమలవుతాయట



ప్రతినెలా కూడా గ్యాస్ , వాణిజ్య గ్యాస్ ధరలు  మారుతూ ఉంటాయి. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం అన్ని సిలిండర్లపైన 50 రూపాయలు పెంచింది.


ఈ ఏడాది వరుసగా రెండుసార్లు ఆర్బిఐ రేపో రేటును సైతం తగ్గించింది.. దీనివల్ల బ్యాంకు వడ్డీ రేట్లలో FD  ఖాతాల నుంచి రుణాల  వరకు అన్నిటిలో మార్పులు రాబోతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు తమ వడ్డీరేట్లు కూడా మార్చాయి. రాబోయే రోజుల్లో బ్యాంకులో వడ్డీ రేట్లు కూడా మార్చే అవకాశం ఉన్నదట.

ఈరోజు నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు జరగబోతోంది. రాష్ట్రాలలో ఉండేటువంటి గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా ఒక పెద్ద బ్యాంకును సృష్టించే విధంగా రుణాలకు చేపడుతున్నారు. RRB పథకం కింద ఇది జరుగుతోందట ఈ మార్పు మొదట 11 రాష్ట్రాలలో మొదలు పెట్టబోతున్నారు.. ఏపీ, బీహార్, కర్ణాటక ,ఒడిస్సా, రాజస్థాన్, గుజరాత్ ,బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ,ఉత్తర ప్రదేశ్ ,పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్


అలాగే ఈరోజు నుంచి రైల్వే టికెట్ బుకింగ్స్ లో కూడా పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది.. ఇకమీదట వెయిటింగ్ టికెట్ల పైన.. స్లీపర్, ఏసీ కోచ్లలో అసలు ప్రయాణించలేరట.

మరింత సమాచారం తెలుసుకోండి: