టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి మీనాక్షి చౌదరి ఒకరు. ఈ భామ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు అందుకుంది. అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. రీసెంట్ గా ఈ చిన్నది నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

ఇందులో హీరో వెంకటేష్ కు ఎక్స్ లవర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా అనంతరం మీనాక్షి చౌదరికి వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాష చిత్రాలలో కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఈ సమయంలోనే మీనాక్షి చౌదరి అంకుల్ వయసులో ఉన్న ఓ వ్యక్తితో కలిసి మీనాక్షి మీనాక్షి అనే పాటకు స్టెప్పులు వేసింది. ఆ వీడియో చూసిన మీనాక్షి అభిమానులు అతను ఎవరు ఏంటి అనే సందేహంలో చాలామంది పడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం పైన మీనాక్షి చౌదరి ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: