అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కు పేరు పెట్టాల్సిన అవసరంలేదు. ఎలాంటి
నటన అయినా దర్శకుడితో ప్రతిభ ఉంటె... ఈజీగా రాబట్టు కోగలుగుతారు. దర్శకులకు
ఏం కావాలో అది ఇవ్వడమే నటుల పని. అలా ఇవ్వగలినపుడు నటుడు మహానటుడు
కాగలుగుతారు. అమితాబ్ విషయంలో ఇదినిజమైంది.
రూమీ
జఫేరీ దర్శకత్వంలో అమితాబ్ చెహారే సినిమా చేస్తున్నారు. అమితాబ్ తో పాటు
ఇమ్రాన్ హస్మి, కృతి కర్బందలు నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత
రసూల్ పూకుట్టి ఈసినిమాకు పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటె, ఈ సినిమాకు
సంబందించిన ఓ సీన్ ను షూట్ చేశారు.
అది 14
నిమిషాల సీన్. ఇంతపెద్ద సీన్స్ తీయాలంటే మాములుగా ఎంత సమయం పడుతుందో
చెప్పక్కర్లేదు. కానీ అమితాబ్ మాత్రం ఈ 14 నిమిషాల సీన్ ను కట్ లేకుండా
సింగిల్ టేక్ లో తీశారట . మాములుగా ఒకటి రెండు సినిమాల సీన్ ను సింగిల్
టేక్ లో చేయడం అంటే సరే.. 14 నిమిషాలంటే గ్రేట్ కదా.
అమితాబ్
బచ్చన్ భారత్ సినిమాలో మరో చరిత్ర సృష్టించారు. ‘చెహరే’ సినిమా తొలి
షెడ్యూల్లో చివరి రోజు షూట్లో అమితాబ్ 14 నిమిషాల సన్నివేశాన్ని ఒక్క
షాట్లో చేసేశారు. సీన్షూట్ పూర్తయిన తర్వాత మొత్తం చిత్ర బృందం నిల్చుని
చప్పట్లు కొట్టారు. డియర్ సర్.. అనుమానమే లేదు.. ఈ ప్రపంచంలోని ఉత్తమ
నటుల్లో మీరొకరు అని రసూల్ పుకొట్టి ట్వీట్ చేశారు. మరి బిగ్ బి నా మజాకా.