
అయితే అర్జున్ అనేది కొత్త ఆయుధమేమీ కాదు.. ఇప్పటికే సైన్యంలో అర్జున్ ఎంబీటీ యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుతం ఇప్పుడు సేవలు అందిస్తున్న మోడల్‌కు 70 కు పైగా మార్పులు చేసి.. దీన్ని ఆధునీకరించారు. కొత్త మార్పులతో అర్జున్ మార్క్ 1ఏ అధునాతన ట్యాంకు అద్భుతమైన శక్తులు సంతరించుకుంది. ఈ కొత్త ట్యాంకు వివరాల్లోకి వెళ్తే.. ఇది దాదాపు 68 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 120 ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు.
ఇది ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడే స్థాయిలో ఉంది. దీన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది స్థిరంగా పనిచేస్తుంది. అంతే కాదు.. లక్ష్యాన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను ఈ ట్యాంక్ గన్‌లో ఉంది. ఇది వేగంగా కదులుతున్న టార్గెట్లను కూడా సులభంగా పేల్చివేస్తుంది. టార్గెట్‌ను చేరుకోగానే తూటా అక్కడి ఆక్సిజన్‌ను పూర్తిగా వాడుకుని పేలుతుంది. చొచ్చుకుపోయిన తర్వాత ఇది విస్ఫోటం చెందేలా డిజైన్ చేశారు.
చైనాతో ఘర్షణల తర్వాత ఇండియా తన ఆయుధ సంపత్తిని మరింత మెరుగుపరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగాంగానే ఈ సరికొత్త బ్రహ్మాస్త్రాలు.. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అర్జున్ యుద్ధ ట్యాంకు మార్క్-1ఏ’ను సైన్యానికి అప్పగించారు. ట్యాంకు నమూనాను ప్రధాని మోదీ సైన్యాధిపతి ఎంఎం నరవణేకు అందజేశారు.