రాష్ట్రంలో ఫ్యాన్ రివర్స్ అవుతుంది...2019 ఎన్నికల సమయంలో బాగా స్పీడ్ గా తిరిగిన ఫ్యాన్..ఇప్పుడు నిదానంగా రివర్స్ అవుతుంది...ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు..వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కావొస్తుంది...ఈ మూడేళ్ళ కాలంలో వైసీపీ బలం తగ్గుతూనే వస్తుంది..తప్ప ఇంకా పెరగలేదు..అయితే స్థానిక ఎన్నికల ఫలితాలు కేవలం అధికారం బలం మీద ఆధారపడి వచ్చాయనే చెప్పొచ్చు..కాబట్టి క్షేత్ర స్థాయిలో వైసీపీ బలం తగ్గుతుందనే చెప్పొచ్చు..దాదాపు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో వైసీపీ సంగతి చెప్పాల్సిన పని లేదు..జిల్లాలో వైసీపీకి దారుణమైన పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఆఖరికి వైసీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా సీన్ రివర్స్ అవుతుంది. గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ ఫుల్ రివర్స్ అయ్యేలా ఉంది..గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి మేకా ప్రతాప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం, టీడీపీలో గ్రూప్ తగాదాలు ఉండటం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది...కానీ ఇప్పుడు పరిస్తితి అలా లేదు...టీడీపీ నేతలు ఐకమత్యంగా పోరాడుతున్నారు...అలాగే గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇప్పుడుప్పుడే పికప్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో ముద్దరబోయిన ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేదు...పార్టీని బలోపేతం చేయలేదు.

అయితే ఇప్పుడు మాత్రం పరిస్తితి మారింది...ముద్దరబోయిన కూడా బాగా మారిపోయారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..వైసీపీ అక్రమాలని ప్రశ్నిస్తున్నారు..అలాగే ఈ మధ్య ఎమ్మెల్యేతోనే డైరక్ట్‌గా సవాల్ చేసి డిబేట్‌కు వచ్చారు..కానీ పోలీసులు ఆయన్ని ఆపేశారు. ఢీ అంటే ఢీ అనేలా ముద్దరబోయిన రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏ మాత్రం తగ్గకుండా మేకా ప్రతాప్‌కు నెక్స్ట్ చెక్ పెట్టాలని కష్టపడుతున్నారు. ఇక నూజివీడు ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోంది..ఈ సారి అక్కడ టీడీపీకి అవకాశం ఇచ్చేలా ఉన్నారు. అంటే ఫ్యాన్ రివర్స్ అవుతుందనే చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: