కోర్టుల్లో జరిగే వాదనలు, విచారణల సందర్భంగా జడ్జీలు చేసే వ్యాఖ్యలను మీడియా తనిష్ట ప్రకారం ఎలా వక్రీకరిస్తుందో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు ఇప్పటికి తెలిసొచ్చినట్లుంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి సంబంధించిన విచారణలో జడ్జీల వ్యాఖ్యలను మీడియా తనిష్టం వచ్చినట్లు వక్రీకరిస్తోందని, తాము అనని మాటలను కూడా అన్నట్లుగా తప్పుడు వార్తలు రాస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెగ బాధపడిపోయారు. కోర్టు వ్యాఖ్యలను ఓ వర్గం మీడియా పూర్తిగా వక్రీకరిస్తోందంటు మండిపోయారు.

మీడియాలో వస్తున్న వార్తల వల్ల జనాలముందు తాము విలన్లుగా మారాల్సొస్తోందంటు చీఫ్ జస్టిస్ తీవ్రస్ధాయిలో మండిపోయారు. కాలుష్యం వల్ల ఢిల్లీలో స్కూళ్ళను మూసేయాలని సుప్రింకోర్టు ఆదేశించిందని ఓ పత్రికలో తప్పుడు వార్త వచ్చిన విషయాన్ని చీఫ్ జస్టిస్ ఉదాహరణగా చూపించారు. స్కూళ్ళను మూసేయాలని తామెప్పుడు ఆదేశాలిచ్చామంటు సదరు ఇంగ్లీషు దినపత్రికను నిలదీశారు. కాలుష్యం కారణంగా పెద్దవాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారని మాత్రమే తాము వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు.

సరే ఇదే సందర్భంగా తమ వ్యాఖ్యలను మీడియా ఏ విధంగా వక్రీకరిస్తోందో ఉదాహరణలతో సహా వివరించారు. ఇదంతా బాగానే ఉంది ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుండో మొత్తుకుంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలైన వందలాది కేసుల విచారణ జరుగుతోంది. ఈ విచారణలో జడ్జీలు అనేక వ్యాఖ్యలను చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను జగన్ వ్యతిరేకత మీడియా తనిష్టానుసారం బ్యానర్ వార్తలుగా రాస్తోంది. వాటిని చదివిన జనాలు ఆ హెడ్డింగులను చూసి కోర్టు తీర్పులుగా భ్రమపడుతున్నారు.

ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండుకాద అనేక కేసుల విచారణలో ఇలాగే జరుగుతోంది. ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తంచేసినా హైకోర్టు పట్టించుకోలేదు. చివరకు ఒక కేసు విచారణలో తమ వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తోందని స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రాయే నెత్తీ నోరు మొత్తుకున్నారు. అందుకనే కేసుల విచారణ సందర్భంగా జడ్జీలు ఎలాంటి వ్యాఖ్యలను చేయవద్దని కూడా ఆదేశించారు.

కేసుల విచారణలో జడ్జీలు చేస్తున్న వ్యాఖ్యలు తమపై  వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోందని ఏపీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు. ఏదో కేసు విచారణలో సుప్రింకోర్టు మాత్రం వ్యాఖ్యలు చేసేముందు  జడ్జీలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించింది. కానీ స్వయంగా చీఫ్ జస్టిస్సే ఇపుడు కోర్టు వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తోందని చెప్పటం గమనార్హం. మొత్తానికి మీడియా వక్రీకరణ బాధేంటో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు స్వయంగా తెలిసొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: