
వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ పార్టీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గత ఎన్నికలకు ముందు వరకు అంబటి రాంబాబు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు జగన్ ప్రభుత్వం లో మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికలలోను ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి టిడిపి నుంచి పోటీ చేసిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. ఇక ఎన్నికలలో ఓటమి తర్వాత అంబటి రాంబాబును జగన్ సత్తెనపల్లి నుంచి తప్పించి గుంటూరుకు పంపేశారు. అంబటి రాంబాబుకు గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా నియమించారు.
దీంతో అంబటి రాంబాబు వైసీపీలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రెండు జిల్లాలకు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరించడంతోపాటు రెండు వేరువేరు జిల్లాలలో నియోజకవర్గాలకు వైసిపి ఇన్చార్జిగా వ్యవహరించినట్టు రికార్డుల్లోకి ఎక్కారు. ఇక అంబటి రాంబాబు 1989 లోనే కాంగ్రెస్ తరపున తన సొంత ప్రాంతమైన రేపల్లె నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత 2019లో ఆయన వైయస్ జగన్ ప్రభంజనంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికలలో ఓడిపోయిన రాంబాబు వచ్చే ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రణాళికలో భాగంగా ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికయ్యారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు