
టెస్ట్ ట్వింట్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 80 ఓవర్ల ఫార్మాట్ గా రాబోతోంది. ఇందులో ప్రతి జట్టుకు ఒకేసారి 40 ఓవర్లు ఆడడానికి బదులుగా 20 20 చొప్పున రెండు ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం లభిస్తుంది. అంటే టెస్ట్ మ్యాచ్ లలో లాగానే ప్రతి జట్టు కూడా రెండుసార్లు బ్యాటింగ్ చేయొచ్చు. ఇందులోనే టెస్ట్, టి20 రెండిటి నియమాలు కూడా అమలులో ఉంటాయి. ఫలితాల విషయానికి వస్తే గెలుపు, ఓటమి, టై, డ్రా వంటివి నాలుగు రకాలుగా ఫలితాలను ఇందులో పొందపరిచారు.
టెస్ట్ ట్వింట్ మొదటి సీజన్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో తొలి సీజన్లో 6 ప్రాంచైజీలు పాల్గొనబోతున్నాయి. ఇందులో కూడా మూడు జట్లు ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించగా, మిగిలిన మూడు జట్లు లండన్, దుబాయ్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వంటివి ఆడుతాయి. ప్రతి జట్టులో 16 మంది ఆటగాళ్ల ఎంపిక చేసుకుంటారు. ఈ కొత్త ఫార్మేట్ క్రికెట్ ను ది వన్ వన్ సిక్స్ నెట్వర్క్ కార్యనిర్వహకుడు అయిన గౌరవ బహిర్వాణి రూపొందించబోతున్నారు. దీంతో ఈ విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి కూడా భారీగానే విశేష స్పందన లభిస్తోంది. యువ ఆటగాళ్లకు ఇందులో మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు.