ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని కొన్ని కుటుంబాలు ఒక రోజున తమ ఇంటి వారంలా కొలుస్తూ పూజిస్తూ తమ ఇష్టమైన దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు.. అయితే ఒక్కో రోజున ఒక్కో దేవుడికి ప్రత్యేకంగా పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏ రోజున ఏ దేవుడిని పూజించడం వల్ల మనకు శుభం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సోమవారం:
సోమవారం అనగానే చాలామందికి పరమశివుడు గుర్తొస్తాడు. ఎందుకంటే సోమవారం చంద్రునికి సంబంధించిన రోజు.. ఇక పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కూడా.. ఈ రోజున శివుడికి బిల్వ దళాలు లేదా మారేడు పూలతో పూజ చేస్తే మనం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడమే కాకుండా సిరి సంపదలు కూడా పొందవచ్చు.


మంగళవారం:
మంగళ వారం రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామిని అలాగే దుర్గామాతను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న లేదా భయాలు,  రోగాలు ఉన్నట్లయితే ఆంజనేయస్వామికి తమలపాకుల మాల , వడ మాల వేసి అర్చన చేయడం వలన సకల భయాలు దూరం అవుతాయి.. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే దుర్గామాతను లేదా కాళీ దేవిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

బుధవారం:
బుధవారం రోజున శ్రీ మహా గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఎర్రటి మందారాలతో పూజ చేస్తే అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి.

గురువారం:
ఈ రోజున సాయిబాబాకు,  గురుగ్రహానికి పూజలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, పాలతో తయారుచేసిన పదార్థాలతో సాయిబాబాను పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం:
మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి తులసి పూజ, గోపూజ చేసినా కూడా శుభ ఫలితం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా పొందవచ్చు.

శనివారం:
వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు.. ఇక అలాగే శనీశ్వరుడికి ఆంజనేయస్వామికి కూడా పూజలు నిర్వహించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు.

ఆదివారం:
వారంలో తొలి రోజు కాబట్టి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్యభగవానుడిని పూజించటం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా జీవిస్తాము. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి ధాన్యాన్ని సమర్పిస్తే సత్ఫలితాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: