మనిషి జీవితం ఎంతో అమూల్యమైంది. సంస్కారం వివేకాన్ని మేల్కొలిపితే, సంయమనం మానవతా విలువలకు మెరుగు పెడుతుంది. జ్ఞాన సంపదతో ఇతరులకు మేలు చేకూర్చేవాడే అసలైన మనిషి. మీరు తల్లిదండ్రులైతే.. మీ బిడ్డలకు ఉత్తమ విద్యాబుద్ధులు, మంచి నడవడికను కానుకలుగా ఇవ్వాలి.

Related image


ప్రతి మనిషి తన హృదయ కాఠిన్యాన్ని దూరం చేసుకోవాలి. దయాదాక్షిణ్యాలు గల పనులు ప్రారంభించి క్రియాత్మకంగా ఆచరించాలి. అనాథలు, స్త్రీల హక్కులను కాజేసే ప్రయత్నం ఎవరూ చేయరాదు. అతిక్రమించినవారిని అనాథ బాలల్ని కొట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది.

Related image


పొరుగువారి పట్ల బాధ్యత చూపాలి. తాను కడుపు నిండా భుజించి, పొరుగువారు పస్తులుంటున్నది గమనిస్తూ సహించిన వ్యక్తి మనిషే కాదు. అధిక ఆహారముంటే, దాన్ని ఆహార కొరత ఉన్నవారికి ఇవ్వాలి. అందువల్ల సమాజం ప్రేమపూరితమై ఆనందభరితమవుతుంది.

Image result for humanity


ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి పట్ల పలు బాధ్యతలుంటాయి. నీవు ఎవరిని కలిసినా ప్రేమగా పలకరించాలి. భోజనానికి ఆహ్వానిస్తే, స్వీకరించాలి. అతడు నీ నుంచి మేలు కాంక్షిస్తే అది అందజేయాలి. వ్యాధిగ్రస్తుడైతే, వెళ్లి పరామర్శించాలి. దివంగతుడైతే, అతడి అంతిమ యాత్రకు హాజరై గౌరవించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: