తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో సుడిగాలి సుదీర్ టీమ్ లో ఉండే కమెడియన్ సన్నీ కూడా ఒకరు.. విభిన్నమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సన్నీ జీవితంలో కూడా విషాద సంఘటనలు ఉన్నాయట. ముఖ్యంగా ఎప్పుడూ కూడా తాగుబోతు క్యారెక్టర్ లను వేస్తూ ఉండే సన్నీ జీవితంలో కూడా ఒక విషాదం ఉన్నది.. ఆస్తి బాగానే ఉన్న ఒక అమ్మాయి కోసం తన జీవితాన్నే వదిలేసుకున్నాడు.


ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ మరో వివాహం చేసుకోకుండా ఉన్నారట. ఈ విషయాన్ని తానే ఒకానొక సమయంలో జబర్దస్త్ ఎపిసోడ్ లో తెలియజేయడం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తనకి ప్రేమ పెళ్లి పైన నమ్మకం కోల్పోయానని అందుకే ఇప్పటికి తాను ఒంటరిగానే ఉంటున్నానంటూ తెలియజేశారు. యాంకర్ రష్మి తన లవ్ స్టోరీ గురించి అడగగా ఈ విషయాన్ని తెలియజేశారు సన్నీ. 8 ఏళ్ల పాటు ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాము.. కానీ ఆ అమ్మాయి చివరికి తనను వదిలేసి వేరే అబ్బాయిని వివాహం చేస్తుందని తెలిపారు.


అయితే ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందని అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు సన్నీ. సన్నీకి ఆస్తి బాగానే ఉంది. అలాగే తన అన్న ,వదిన ఇద్దరు కూడా డాక్టర్లే.. అంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా తను తన సొంత ఇంట్లో ఉండరు.. ఎప్పుడూ కూడా మాతోనే రూమ్లో కలిసి ఉంటాడని.. ఆ అమ్మాయి కోసం తన జీవితాన్ని వదిలేసాడంటూ చెప్పారు. ఈ విషయం విన్న అభిమానులు పలువురు నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు కడుపుబ్బ నవ్వించే సన్నీ జీవితంలో కూడా ఇంతటి విషాదం దాగి ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకో అన్నా అంటూ సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: