
అయితే ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా అటు రవినా తరచూ సోషల్ మీడియాలో వీడియోలను చేస్తూ పోస్ట్ చేస్తూ ఉండేదట. అయితే సురేష్ తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అటు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు నచ్చేది కాదు. దీనివల్ల అటు తరచూ ప్రవీణ్ రవినా మధ్య గొడవలు జరిగేవట. దీంతో ప్రవీణ్ తన భార్య చేసిన రీల్స్ చూడలేక మద్యానికి బానిస అయ్యి గొడవలు పడుతూ ఉండేవారట.అలా మార్చి 25న రవీనా ఇంటికి సురేష్ వచ్చారు. అయితే వీరిద్దరిని చూసిన రవినా భర్త ప్రవీణ్ మండిపోయి వీరిని నిలదీయడం జరిగింది. ఇక అదే రోజున రాత్రి రవినా ,సురేష్ కలిసి ప్రవీణ్ గొంతు కోసి హత్య చేశారట.
అనంతరం అర్ధరాత్రి 2:30 నిమిషాలకు ప్రవీణ్ మృతదేహాన్ని బైకు మీద తీసుకువెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ప్రవీణ్ ఎక్కడ అని రవినాని ప్రశ్నించగా ఆమె తికమక సమాధానాలు చెబుతూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఫిర్యాదు చేసిన అనంతరం మూడు రోజులకు కాలువలు మృతి దేహం దొరికింది ఆ ప్రాంతంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో రవీనా తన ప్రియుడు సురేష్ కలిసి ఈ పని చేశారని బయటపడింది. దీంతో ఆమెను జైలుకు పంపించారు.ఇక సురేష్ కోసం పోలీసులు తెగ గాలిస్తూ ఉన్నారు. పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.