మారుతి సుజుకి ఆల్టో K10 గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఇది దేశంలోనే అత్యంత సరసమైన కారు. మధ్య తరగతి ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన కార్. ఇక Alto K10 ధరలో తక్కువగా ఉండటమే కాకుండా అత్యధిక మైలేజీని ఇచ్చే కార్లలో ఇది కూడా ఒకటి. కంపెనీ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఆల్టో కె10 సిఎన్‌జి ఆప్షన్ ని కూడా అందిస్తుంది. పైగా ఈ కార్ తక్కువ ధర ఉన్నప్పటికీ, ఇది అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.ఇది తక్కువ ఖర్చుతో నడిచే బెస్ట్ సిటీ కార్. ఈ కారు సైజులో చిన్నది అయినప్పటికీ, ఈ కారు ఐదుగురు వ్యక్తులు కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది.ఈ కారు మైంటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు సంవత్సరానికి 5 నుంచి 6 వేల రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జీగా ఈ కార్ కి ఖర్చు చేయవలసి ఉంటుంది. అంటే నెలకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, స్పేర్స్, పార్ట్ రీప్లేస్‌మెంట్ ఖర్చు మాత్రం లేదు.ఆల్టో కె10 మొత్య 7 వేరియంట్లలో వస్తుంది. దీనితో పాటు, కారులో చాలా రకాల ఫీచర్లు కూడా అందించబడ్డాయి.


 ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఇంకా మాన్యువల్‌గా అడ్జస్టబుల్ ORVMలు వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇక Alto K10 ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలై రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుంది.  మీరు Alto K10 బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఈ కారు మీకు రోడ్డుపై ఖర్చు రూ. 4,43,170 అవుతుంది. మీరు కారు కోసం రూ.1,32,000 డౌన్ పేమెంట్ చేసి, 7 సంవత్సరాలకు 9% వడ్డీ రేటుతో రూ.3.11 లక్షల లోన్ తీసుకుంటే,అప్పుడు మీరు ప్రతి నెలా రూ.5,000 EMI చెల్లించాలి. అయితే, ఈ లోన్ మీకు క్రెడిట్ స్కోర్, బ్యాంక్ నిబంధనలు, షరతుల ఆధారంగా మాత్రమే ఉంటుంది.కె10లో  1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ వస్తుంది. ఇంకా దీనితో పాటు, cng ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్‌లో 65.71 బిహెచ్‌పి, సిఎన్‌జిలో 55.92 బిహెచ్‌పి పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని మైలేజీ గురించి మాట్లాడితే, ఈ కారు పెట్రోల్‌పై లీటర్‌కు 28 కిమీలు, సిఎన్‌జిపై లీటరుకు 36 కిమీ మైలేజీని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: