టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత గురించి మోదీ కంగారు పడుతున్నారట. చంద్రబాబు సెక్యూరిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోయినా  కేంద్రానికి బాగాఉందట. ఇది అభినందనీయమని తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు అంటున్నారు. చంద్రబాబు భద్రత లోపాలు సవరించేందుకే ఎన్ఎస్జీ డీఐజీ పార్టీ కార్యాలయం, ఉండవల్లి లోని నివాసాలను పరిశీలించారని అశోక్‌బాబు తెలిపారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ జరుగుతున్న వరుస దాడుల్ని ఎన్ఎస్జీ పరిగణనలోకి తీసుకుందని అశోక్‌ బాబు అంటున్నారు. డబ్బులిచ్చి మరీ చంద్రబాబు పై దాడిని ప్రోత్సహిస్తున్న తీరును ఎన్ఎస్జీ సీరియస్ గా తీసుకుందని అశోక్‌ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసుల భద్రతా వైఫ్యల్యం పరిణామాలు పైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అశోక్‌ బాబు తెలిపారు. జెడ్ ప్లస్ భద్రత లో ఉన్న నాయకుడి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని అశోక్‌ బాబు కోరారు.


ఇవాళ తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లక ముందే ఎన్ఎస్జీ చొరవ తీసుకుందని అశోక్‌ బాబు స్పష్టం చేసారు. రాష్ట్ర పరిణామాలు పట్ల పట్టనట్లు వ్యవహరించటం గవర్నర్ కు తగదని అశోక్ బాబు హితవు పలికారు. తమ సహనాన్ని చేతకానితనం గా తీసుకుంటే అందుకు తగ్గ ప్రతిచర్యలు ఉంటాయని అశోక్‌ బాబు హెచ్చరించారు. తెలుగుదేశం క్యాడర్ రోడ్డు మీదకు వస్తే ఆ సునామీ తట్టుకునే శక్తి లేదని గుర్తు పెట్టుకోండని అశోక్‌ బాబు వైసీపీ నేతలకు హితవు  చెబుతున్నారు.


మొత్తానికి చంద్రబాబు భద్రత గురించి ఏకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆరా తీయడాన్ని టీడీపీ నేతలు ఓ సెలబ్రేషన్‌గా భావిస్తున్నారు. కేంద్రంలో చంద్రబాబుకు పెరుగుతున్న పరపతికి ఇది ఓ నిదర్శనం అని చెబుతున్నారు. మరి ఇదంతా నిజమేనా.. ఎన్‌ఎస్‌జీ జోక్యం రొటీన్ తనిఖీల్లో భాగమేనా లేక.. నిజంగానే మోదీ చంద్రబాబు భద్రత గురించి నిజంగానే ఆందోళన చెందుతున్నారా...?

మరింత సమాచారం తెలుసుకోండి: