
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. నిన్న 32,498వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 615 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,835కి చేరింది. రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించగా.. జూన్ 16న సవరించిన లెక్కల ప్రకారం దేశంలో ఒక్క రోజే 2,003 నమోదయ్యాయి. ఆ తర్వాత బుధవారం అత్యధికంగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ 6,11,973 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించి ప్రజలు మళ్లీ బయటకు వచ్చారో.. అప్పటి నుంచి కేసులు పుంజుకోవడం మొదలయ్యాయని అంటున్నారు అధికారులు.
ఇక జూన్ నెలలో నాలుగు లక్షల కేసులు నమోదు కాగా.. జులై నెల 15 రోజుల్లోనే 3,83,361 కేసులు నమోదయ్యాయి. జూన్‌లో కరోనాతో 12,000 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ 15 రోజుల్లోనే 7,468 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలోమొన్నటి వరకు కరోనా కేసులు భయపెట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెలాఖరు వరకు 5.5 లక్షల కరోనా బాధితులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రస్తుతం అక్కడ రికవరీ రేటు 80 శాతానికి పెరిగింది. మరోవైపు రాజధానిలో కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. గత 25 రోజుల్లో పలు హైటెక్ కొవిడ్ కేర్ సెంటర్లు ఢిల్లీలో ఏర్పాటయ్యాయి.
100 పడకల షెహనాయ్ కొవిడ్ కేర్ సెంటర్లో ఒకేసారి 60 మంది రోగులు చేరారు. అయితే జూలై 15 నాటికి అక్కడ ఒక్క కరోనా రోగి కూడా లేరు. హనాయ్ బ్యాంకెట్ హాల్ కోవిడ్ కేర్ సెంటర్లో రోగుల సంఖ్య తగ్గడంపై ఎల్ఎన్జెపీ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల సీఎం కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలతో కేసులు తగ్గుముఖం పట్టాయని.. ప్రజలకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ఇక స్వల్ప లక్షణాలు ఉన్న వారు, చికిత్స పూర్తయిన వారు, రిపోర్టు కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారని తెలిపారు. షెహనాయ్ కొవిడ్ సెంటర్‌ను ఎల్ఎన్జేపీ దవాఖానతో నుసంధానించారన్నారు.