ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది మహమ్మారి కరోనా వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచ దేశాలను  మాత్రం పట్టి పీడిస్తూనే ఉంది. ఇక ఈ మహమ్మారి వైరస్ కు సరైన వ్యాక్సిన్  కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అందుబాటులోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే ఎంతోమంది మహమ్మారి కరోనా వైరస్ బారినపడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలో కూడా తెర మీదకు వస్తున్నాయి.



అయితే ఇప్పటికే రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులతో ప్రజలందరూ భయాందోళనలో మునిగిపోతుంటే ఇటీవల పలు దేశాలలో కరోనా సెకండ్ వేవ్  కూడా మొదలవడం అందరిలో మరింత భయాందోళన పెంచుతున్న  విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఒకసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ సోక  లేదు కానీ ఇటీవల కాలంలో మాత్రం ఒకసారి కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకున్నప్పటికీ కూడా మరోసారి కరోనా వైరస్ బారిన పడుతున్న కేసులు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక క్రమక్రమంగా కరోనా  సెకండ్ వేవ్  అన్ని దేశాల్లో  ప్రారంభమవుతుంది




 ఇక ఇటీవలే యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్  ప్రారంభం కావడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొంటుంది. కరోనా సెకండ్ వేవ్  ప్రారంభమై ప్రస్తుతం మరోసారి కరోనా వైరస్  విజృంభిస్తోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో శర వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా వైరస్ యూరప్ దేశాల్లో విలయతాండవం చేస్తోంది. యూకే రష్యా నెదర్లాండ్ జపాన్ స్పెయిన్ జర్మనీ ఇటలీ పోర్చుగల్ ఫ్రాన్స్ బెల్జియం దేశాలలో కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తోంది.  యూరప్ దేశాల్లో భారీ సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఆ దేశాలు మళ్లీ లాక్ డౌన్  దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: