కొంతమంది ఇంట్లో శుభకార్యాలు జరిపించాలని ఎంత ప్రయత్నించినా, అవి ఏదో ఒక రకంగా ఆగిపోతుంటాయి. కొన్నింటికి మొదట్లోనే ఆటంకాలు ఎదురైతే, మరికొన్ని చివరి దాకా వచ్చి ఏదో ఒక కారణం చేత నిలిచిపోతుంటాయి. ఇక్కడ శుభకార్యాలు అంటే వివాహం కావచ్చు, పై చదువుల విషయం కావచ్చు, ఉపాధి రీత్యా లేదా మరే ఇతర శుభసంకల్పాలు కావచ్చు. ఇలాంటివి మనము ఎంత అనుకుంటున్నా, ఎంత గట్టిగా ప్రయత్నించినా ఏదో విధంగా ఆగిపోయి మనల్ని నిరాశపరుస్తూ ఉంటాయి. తీవ్రంగా ఆందోళన చెందేలా చేస్తాయి. కానీ ఇలాంటివి మన కుటుంబంలో పునరావృతం కాకూడదు అనుకుంటే వీటికి ఒక మార్గం ఉంది అంటున్నారు వేదాలను అవపోశనపట్టిన పండిత దిగ్గజాలు.

శుభకార్యం అనుకోగానే ముందుగా ఆదిదేవుడు విగ్నేశ్వరుని గుడికి వెళ్లి అర్చన జరిపించి తలచిన శుభకార్యం సవ్యంగా జరగాలని ఆ గణేశుని వేడుకోవాలి. శుభకార్యంలో ఏదైనా జోడుగా చేయాలి. అంటే మీరు ఆ శుభకార్యాన్ని తలచి పూజ మొదలు పెట్టినట్లయితే పూజ లో రెండు అరటి పళ్ళు, రెండు కడ్డీలు, రెండు కర్పూరాలు, వాయనం ఇచ్చిన సమయంలో పంచె మరియు కండువా జతగా ఇవ్వాలి. చీర జాకెట్ జతగా, పసుపు కుంకుమ జతగా ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మనకు  ఫలితం దక్కుతుంది. ఏ వ్యక్తికి అయితే శుభకార్యం అనుకుంటామో, వారికి ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసుకొని శాంతి పూజలు చేయించాలి.

మీ ఇష్టదైవానికి మీ ఆవేదనను మొరపెట్టుకొని, అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ఫలానా పని చేస్తామని సంకల్పించాలి. ఉదాహరణకు అనుకున్న శుభకార్యం ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతే అన్న దానం చేస్తానని మొక్కుకోవడం, ప్రత్యేక పూజలు  జరిపిస్తానని అనుకోవడం, ఆ దేవుని సేవలో ఒక రోజంతా పాల్గొంటామని నిశ్చయించుకోవడం లాంటివి అన్నమాట. ఇలా కొన్నింటిని ముందు వెనుక ఆలోచించి కనుక  పాటిస్తే, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శుభ కార్యాలు సవ్యంగా జరిగిపోతాయని అంటున్నారు వేద పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: