
న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ తాజాగా ఒక టీజర్ ని విడుదల చేసింది.. ఈ టీజర్ లో కుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జిలుగా కనిపిస్తూ ఉండగా చలాకి చంటి మళ్లీ చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అలాగే ఆటో రాంప్రసాద్ ,బుల్లెట్ భాస్కర్, రాఘవ తదితరులు టీం లీడర్లుగా కనిపించారు. ఈసారి ఆడియన్స్ ని కూడా లొకేషన్ కి తీసుకువచ్చి మరి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పటివరకు చేయని సరికొత్త ప్లాన్ చేసింది మల్లెమాల.
ఇక ఎంటర్టైన్మెంట్ డబుల్.. ఎనర్జీ డబుల్.. ఎనీ థింగ్ డబుల్ అని జడ్జ్ కుష్బూ చొప్పగా అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండబోతోందా అంటూ రష్మీ అడగగా? అందుకు షాక్ ఇస్తూ కుష్బూ అవును అని చెబుతుంది.. దీంతో రష్మీ నన్ను తట్టుకొని వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించగా ?అప్పుడే బ్రహ్మముడి సీరియల్ మానస్ ఎంట్రీ చూపించారు. మొదటిసారి హోస్టుగా చేస్తున్న మానస్ ఇప్పటివరకు బిగ్ బాస్ తో పాటు పలు రకాల టీవీ షోలలో కనిపించారు. ఇలా మొదటిసారి యాంకర్ గా కనిపించడం జరుగుతోంది. మరి ఏ మేరకు రష్మీ ని తట్టుకొని నిలబడతారో చూడాలి మరి.