
ఇలా నిందితులకు శిక్ష పడటంలో ఆలస్యం అవుతున్న కారణంగా కొంతమందికి అయితే ఇక చట్టాలపై ఉన్న నమ్మకం కూడా రోజురోజుకు తగ్గిపోతుంది అని చెప్పాలి. అదే సమయంలో పోలీసులు సైతం కొన్ని కేసుల్లో అలసత్వం వహించడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే భారత చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా నిందితులు ఎలా తప్పించుకోగలుగుతున్నారు. బయట ఏదేచ్ఛగా ఎంతో సులభంగా తిరగ గలుగుతున్నారు అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మారింది. ఎందుకంటే ఒక కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 ఏళ్ల తర్వాత శిక్ష పండింది. ఈ ఘటన సంచలనంగా మారిపోయింది.
అయితే ఈ ఘటన ఎక్కడో కాదు కేరళలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక మోసం కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితురాలని 36 ఏళ్ళ తర్వాత సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. కేరళ తుల్లపల్లికి చెందిన మరియమ్మ పై ఆర్థిక నేరం కింద 1987లో కేసు నమోదయింది. అయితే మరియమ్మ అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతుంది. కాగా మహేష్ భగవత్ సిఐడి అదనపు డీజి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇక మరియమ్మ కేసు కూడా రీ ఓపెన్ చేశారు దీంతో ఇక పోలీసులు కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేశారు.