కావాల్సిన ప‌దార్థాలు:
మామిడికాయలు- నాలుగు
ఆవాలు- ఒక చెంచా
పసుపు- పావుచెంచా

 

మెంతులు- అరకప్పు
బెల్లం తురుము- పావుకప్పు
నూనె- త‌గినంత‌

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
ఎండు మిర్చి- నాలుగు
ఇంగువ- చిటికెడు

 

తయారీ విధానం: ముందుగా మామిడికాయల చెక్కు తీసి కడిగి తుడిచి, తురిమి ఆరనివ్వాలి. ఇప్పుడు పాన్‌ వేడిచేసి మెంతులు, ఎండుమిర్చి వేయాలి. మెంతులు ఎర్రగా వేగాక  ఆవాలు వేసి చిటపటలాడాకా దించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి.  ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఆరిన మామిడి తురుము తీసుకొని దానికి మిక్సీ పట్టిన మెంతి, ఆవపొడి కలిపి పట్టించాలి. 

 

చివరగా ఉప్పు, పసుపు, ఇంగువ, బెల్లం తురుము, నూనె వేసి బాగా ఇక గాజు డ‌బ్బాలో పెట్టుకోవాలి. అంతే నోరూరించే మామిడి మెంతి పచ్చడి రెడీ. దీని ఒక ఐదు గంట‌ల త‌ర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే వారంపాటు నిల్వ ఉంటుంది. ఖ‌చ్చితంగా మీరూ ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: