అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. మన కృషికి అదృష్టం తోడైతే ఇక తిరుగేముంది. ఈ రెండింటినీ అందిపుచ్చుకుని తన ప్రతిభను ఈ లోకానికి చాటి చెప్పాడు అల్లు అర్జున్. నేడు స్టైల్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచిన మన ఐకాన్ స్టార్ ఒకప్పుడు ఇతడు హీరో ఎంటి..?? అన్న విమర్శల నుండి దాటుకొచ్చినవారే. మెగాస్టార్ మేనల్లుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ నేడు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నేడు కోట్లల్లో పారితోషికాన్ని అందుకుంటున్న ఈ స్టార్ హీరో ఒకప్పుడు తన మొదటి సినిమాకి కేవలం ఏడు లక్షలు తీసుకున్నారని సమాచారం.

ఈ యంగ్ హీరో వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. చిరంజీవి హీరోగా నటించిన విజేత చిత్రంలో తొలి సారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు బన్నీ. గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఇపుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ ప్రతిభకు ఎన్నో అవార్డులు లభించాయి. ఇప్పటివరకు ఐఫా అవార్డ్స్, సినిమా అవార్డ్స్, నంది అవార్డ్స్, సంతోషం ఫిలింఫేర్ అవార్డు లు అందుకున్నారు. బన్నీకి తండ్రి నుండి వచ్చిన ఆస్తులే కాకుండా హీరోగా కష్టపడి స్వతహాగా సంపాదించిన విలువైన ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని మీడియా చానెళ్లు తెలిపిన సమాచారం మేరకు బన్నీ అస్తి 350 కోట్ల రూపాయలట.

ఇవి కాకుండా అల్లు అర్జున్ కి  హైదరాబాద్ లో 100 కోట్ల విలువ చేసే పెద్ద ప్యాలెస్ ఉంది . ఈ హీరో వద్ద ఉన్న ఖరీదైన కార్ల విలువ మొత్తంగా చూస్తే పదికోట్ల పై మాటే అని తెలుస్తోంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 నుండి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారట. భవిష్యత్తులో ఇంతకు మించి తీసుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాయి సినిమా వర్గాలు. అయితే అల్లు అర్జున్ ఎప్పుడు రెమ్యూనరేషన్ ఇంతే కావాలని పట్టు బట్టి అడగడు అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ అందరూ ఇలాగే ఆలోచిస్తే ప్రతి నిర్మాత బాగుంటాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: