
అజయ్ సినిమా కథేమిటంటే? .. శంతను గుప్తా రాసిన ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాలో, యోగి బాల్యం నుంచి ఆయన గోరఖ్‌నాథ మఠం కు చెందిన మఠాధిపతి గా ఎదిగిన సంగతి , రాజకీయాల్లో కి ప్రవేశించి ఉత్తరప్రదేశ్ సీఎం గా ఎదిగిన వరకు ఆయన జర్నీని చూపించనున్నారు. ఈ చిత్రంలో: అనంత్ విజయ్ జోషి – యోగి పాత్రలో , పరేష్ రావల్, నిర్హువా, రాజేష్ ఖట్టర్ – ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకత్వం – రవీంద్ర గౌతమ్ , నిర్మాత – రీతు మెంగి , స్క్రీన్‌ప్లే – దిలీప్ బచ్చన్, దిలీప్ మెంగి .. సీబీఎఫ్సీ అడ్డంకులు – హైకోర్టులోకి కేసు ... ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉంది. కా
నీ ఈ సమయంలో CBFC (సెన్సార్ బోర్డు) సినిమా విడుదలపై సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం చేస్తోంది . దీనిపై చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారి అభిప్రాయం ప్రకారం, సర్టిఫికెట్ జారీ చేయడంలో CBFC ఉద్దేశపూర్వక ఆలస్యం చేస్తోందని వారు ఆరోపించారు. హైకోర్టు ఈ వ్యవహారంపై స్పందిస్తూ CBFCకి నోటీసు జారీ చేసింది. సర్టిఫికెట్ జారీ ఆలస్యం వెనుక కారణాలను వివరించాలనీ ఆదేశించింది. దీంతో సినిమా విడుదలపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ఇది కేవలం బయోపిక్ కాదు – ఒక రాజకీయ ప్రయాణం! .. ఈ చిత్రం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత జీవితం, గోరఖ్‌పూర్ ఎంపీగా ఆయన ప్రారంభం, భక్తి మార్గం, రాజకీయ విజ్ఞత – అన్నీ కలబోసిన బయోపిక్. రాజకీయంగా సున్నితమైన పాయింట్లు ఉన్నందునే ఈ సినిమా సెన్సార్ సమస్యల దశకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.