కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఇతని ప్రియురాలు పవిత్ర గౌడ కోసం తన అభిమాని అయినటువంటి రేణుకా స్వామిని హత్య చేయించడంతో ఈ కేసులో పవిత్ర గౌడ,దర్శన్ తో పాటు మరికొంతమంది కూడా ఇరుక్కున్నారు. అయితే గత కొద్ది రోజుల ముందు వీళ్లు జైల్లోనే ఉన్నారు. కానీ ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చినప్పటికీ వారికి ఇచ్చిన బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మళ్లీ దర్శన్ పవిత్ర గౌడ లని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లోకి తరలించారు. ఈ నేపథ్యంలోనే 64 సెషన్స్ కోర్టులో దర్శన్ ని పరప్పన అగ్రహారం జైలు నుండి బళ్లారికి తరలించాలని పిటిషన్ దాఖలు చేశారు.

 అయితే ఈ పిటిషన్ విచారిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేతులో కొన్ని పేపర్లు పట్టుకొని కోర్టులోకి ప్రవేశించి దర్శన్ కి,అలాగే ఈ కేసులో ఇరుకున్న వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష వేయండి.హత్య కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి కోర్టుకు వచ్చి అలా మాట్లాడడంతో జడ్జితో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత మీరు ఎవరు అని జడ్జి అడగగా..ఆయన వ్యక్తిగత విషయాలన్నీ పంచుకున్నారు.

దాంతో జడ్జి కేసుతో సంబంధం లేని వాళ్ళు దరఖాస్తులు నేను అంగీకరించలేను. ఆ వ్యక్తి పిటిషన్ దరఖాస్తులు మొదట చేసుకుంటేనే నేను దీన్ని పరిగణలోకి తీసుకుంటాను. ఈ కేసు విషయంలో తీసుకునే చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారమే ఉండాలి.బయటి వ్యక్తులు వచ్చి జోక్యం చేసుకుంటే నేను వారిని అనుమతించబోను అంటూ జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. ఇక జడ్జి ఇచ్చిన తీర్పుతో కోర్టులోకి ప్రవేశించిన వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ కర్ణాటక ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: