సరిగ్గా ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకాన్ని పట్టుకొని పరేడ్ మార్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఇక అక్కడ అతిధి స్థానంలో కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిద్ర లోకి జారుకున్నారు. ఉక్రెయిన్ క్రీడాకారుల పరేడ్ పూర్తయిన తర్వాత వెంటనే తేరుకుని లేచి థంప్ చూపించారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ క్రీడాకారులు వచ్చినప్పుడు కావాలనే పుతిన్ కునుకు తీస్తున్నట్లు నటించారు అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే.
ఉక్రెయిన్ ను తమ అధీనంలోకి తీసుకుంటామని అటు రష్యా భారీగా సైనికులను మోహరిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో కూడా రష్యా సైన్యాన్ని మోహరించి దిగ్బంధనం చేసింది. ఇలాంటి సమయంలోనే నాటో దళాలు ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.. దీంతో మరికొన్ని రోజుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తప్పదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే బీజింగ్ ఒలింపిక్స్ కు అతిథిగా విచ్చేసిన రష్యా ఉక్రెయిన్ క్రీడాకారులు పరేడ్ నిర్వహిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగానే కునుకు తీస్తున్నట్లు నటించారు అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి