జనసేన అధినేత పవన్ కల్యాణ్ తానొక రాజకీయ అజ్ఞానిగా పదే పదే నిరూపించుకుంటున్నారు. నోటికొచ్చింది మాట్లాడేయటం, ప్రభుత్వంపై బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్న పవన్ కు విషయ పరిజ్ఞానం కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలుకంటున్న పవన్ చట్టసభలపై కనీస జ్ఞానం పెంచుకుందామని కూడా లేకపోవటమే విచిత్రంగా ఉంది.


ఇంతకీ విషయం ఏమిటంటే కాకినాడ ఎంఎల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసుపై పవన్ మాట్లాడారు. అనంతబాబును వెంటన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అనంతబాబును శాసనమండలి సభ్యునిగా ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఎంఎల్సీకి పోలీసులు గౌరవ మర్యాదలు ఇవ్వటం పవన్ కు ఆశ్చర్యం కలిగించిందట.


అనంతబాబును ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు బర్తరఫ్ చేయలేదని నిలదీస్తున్నారు. ఇక్కడే పవన్లోని అజ్ఞానవాసి బయటపడ్డారు. ఎంఎల్సీని బర్తరఫ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒకసారి చట్టసభలకు ఎన్నికైన వ్యక్తిపైన అనర్హత వేటు వేయాలంటే ఆపని చేయాల్సింది కేంద్ర ఎన్నికల కమీషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాత్రమే. ఇపుడు అనంతబాబు విషయమే తీసుకుంటే కోర్టులో విచారణ జరిగి అనంతబాబే హత్యచేసినట్లు నిరూపణకావాలి. అప్పుడు కోర్టు ఎంఎల్సీకి 2 ఏళ్ళకుమించి శిక్షను విధించాలి.


రెండేళ్ళలోపు శిక్ష పడితే ఎన్నికల కమీషన్ కూడా అనంతబాబుపై అనర్హత వేటు వేసేందుకు లేదు. ఎలాగూ ఇది హత్యకేసే కాబట్టి తన డ్రైవర్ ను అనంతబాబే చంపాడని నిరూపణైతే కచ్చితంగా పెద్దశిక్షే పడుతుంది. అప్పుడు కోర్టు వేసిన శిక్షప్రకారం శాసనమండలి కేంద్ర ఎన్నికల కమీషన్ కు అనర్హత వేటు విషయంలో సిఫారసుచేస్తుంది. ఆ సిఫారసు ప్రకారం కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయం కూడా పవన్ తెలీదు. ప్రజాప్రాతినిధ్యచట్టం గురించి కనీసంకూడా తెలుసుకోకుండానే నోటికొచ్చిన డిమాండ్లు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.మరింత సమాచారం తెలుసుకోండి: