కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ 25 నిముషాల భేటీపై చంద్రబాబునాయుడు అండ్ కో నోరెత్తటంలేదు. షాతో జూనియర్ భేటీని టీడీపీ ఏమాత్రం ఊహించలేదు. హైదరాబాద్ రాక సందర్భంగా అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ కానున్నారంటు తమ్ముళ్ళు, ఎల్లోమీడియా ఎంత ఊదరగొట్టింది అందరు చూసిందే. అయితే చంద్రబాబుతో భేటీ లేకపోగా జూనియర్ తో షా భేటీ అయ్యారు. దీన్నే ఎల్లోమీడియా, తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.






అయితే వీళ్ళభేటీ ఎంతిష్టంలేకపోయినా నోరెత్తెందేకు లేదు. ఎందుకంటే తమకిష్టంలేని , నష్టం జరిగే డెవలప్మెంట్ ఏదైనా జరిగితే చంద్రబాబు కానీ ఎల్లోమీడియా కానీ ఎంత గోలచేస్తారో అందరికీ తెలిసిందే. కానీ షా-జూనియర్ భేటీ విషయంలో మాత్రం ఎవరు నోరిప్పలేకపోతున్నారు. మాట్లాడితే షానో లేకపోతే  జూనియర్నో తప్పుపట్టాలి. ఇద్దరిలో ఎవరిని తప్పుపట్టినా ఏం జరుగుతుందో వీళ్ళకి బాగా తెలుసు. షా ను తప్పుపట్టేంత సీన్ చంద్రబాబుకు కానీ లేదా ఎల్లోమీడియాకి కానీ లేదు.





ఇదే సమయంలో జూనియర్ని తప్పుపడితే వీళ్ళకి తప్పొదిలిపోతుంది. జూనియర్ ఎన్టీయార్ అభిమానసంఘాలు ఎంత వైల్డుగా రియాక్టవుతాయో అందరికీ తెలుసు. పైగా జూనియర్ను తప్పుపట్టేందుకు కూడా ఇక్కడ ఏమీలేదు. అమిత్ షా భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే జూనియర్ వెళ్ళారంతే. చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా నరేంద్రమోడీ, అమిత్ షా అసలు అపాయింట్మెంటే ఇవ్వటంలేదు.





తాము శతవిధాల ప్రయత్నిస్తున్నా అపాయిట్మెంట్ ఇవ్వని అమిత్ తనంతట తానుగా జూనియర్ను భోజనానికిరమ్మని ఆహ్వానించటాన్నే చంద్రబాబు అండ్ కో తట్టుకోలేకపోతున్నారు. ఇదేసమయంలో  మాట్లాడకుండా ఊరుకోవటంతప్ప చేయగలిగేది కూడా ఏమీలేదు. అందుకనే వీళ్ళద్దరి మధ్య అసలు భేటీనే జరగనట్లు తమ్ముళ్ళు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు+ఎల్లోమీడియాకు ఎంత కష్టమొచ్చిందో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో షా తో భేటీ అయిన జూనియర్ విషయంలో టీడీపీ అభిమానులు చాలా దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. బీజేపీపై పెద్దాయన అంటే చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ మొత్తం పోరాటం చేస్తుంటే షాతో  జూనియర్ అవుతారా అంటు బూతులు తిడుతు ట్రోలింగ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: