
అయితే 2024 మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గ్రామ అధికారంలోకి వస్తే మార్కాపురం ను ఖచ్చితంగా జిల్లా చేసి తీరుతామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం రోజున ఏపీ జేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా డిమాండ్ పైన చర్చించారు సీఎం చంద్రబాబు.
అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సాధ్యసాద్యాలను పరిశీలించాలని అధికారులకు అలాగే... మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం మార్కాపురం మండలమే కాకుండా రెవెన్యూ డివిజన్ రావడం గమనార్హం. ప్రస్తుతం మార్కాపురం... ప్రకాశం జిల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మార్కాపురంలో పలకలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. జనాభా కూడా విపరీతంగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు