
అయితే గత కొంతకాలం నుంచి వన్డేలు టెస్టు మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన శుభమన్ గిల్ ఇక ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 ఫార్మాట్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే టి20 లలో తన డబ్యు మ్యాచ్ లోనే అదరగొట్టాలని భావిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోని అతని ప్రదర్శన ఎలా ఉంది అనే దానిపైనే అందరి దృష్టి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టెస్టులలో రెగ్యులర్గా వన్డేలలో అప్పుడప్పుడు మాత్రమే భారత్కు ఆడుతున్న ఈ బ్యాటర్ ఇక ఇప్పుడు టి20 లో ఇరగదీయడం ఖాయమని ఎంతోమంది అంచనాలు పెట్టుకున్నారు.
ఈ క్రమం లోనే న్యూజిలాండ్ పర్యటన లో తాను ఎలా రాణిస్తాను అనే విషయం పై ఇటీవల స్పందించిన శుభమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 లో తన బ్యాటింగ్ మంత్ర ఏంటి అన్న విషయాన్ని వెల్లడించాడు. సిక్సులు కొట్టడం అనేది బలంపై కాకుండా టైమింగ్ పై ఆధారపడి ఉంటుంది అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. క్రీజులో సరిగా కుదురుకుంటే ఎంతో అలవోకగా సిక్సర్లు కొట్టగలను అంటూ తెలిపాడు. అదే సమయంలో పదేపదే సిక్సర్లు ఫోర్లు కొట్టేందుకు ప్రయత్నించకుండా కొన్ని కొన్ని సమయాల్లో ఏకంగా స్ట్రైక్ రొటేట్ చేసి పరుగులు చేయడానికి కూడా ప్రయత్నించాలి అంటూ తెలిపాడు..