ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అనే మహాసంగ్రామం లో టీమిండియా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో హోరాహోరీగా తలబడుతుంది అన్న విషయం తెలిసిందే. 2021 లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి కేవలం రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకున్న టీమిండియ ఇక ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియాపై విజయం సాధించి విశ్వవిజేతగా నిలుస్తుంది అని అందరు అనుకున్నారు. ఇక ఎన్నో రోజుల నుంచి భారత జట్టు ను ఊరిస్తున్న వరల్డ్ కప్ సొంతమవుతుందని ఆశపడ్డారు. కానీ ఊహించిన రీతిలో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. అయితే బౌలర్లు పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ అటు బ్యాట్స్మెన్లు మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. కీలకమైన సమయంలో చేతులెత్తేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఐపీఎల్ లో సెంచరీల మోత మోగించిన కోహ్లీ, గిల్ లు సైతం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోవడం.. ఇక మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు భారీగా పరుగులు చేస్తున్న నేపథ్యంలో ఇక టీమ్ ఇండియాకు విజయం క్రమక్రమంగా దూరం అవుతుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరు ఊహించినట్లుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా ఫీల్డింగ్  ఎంచుకోవడం గురించి కూడా విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019లో యాషెష్ సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా చేసిన పొరపాటు ఇక ఇప్పుడు భారత్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ టీం ఫైన్ టాస్ గెలిచాడు. కానీ బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది బౌలింగ్ ఎంచుకున్నాడు అంటూ గుర్తు చేశాడు. చివరికి మ్యాచ్లో ఇంగ్లాండ్ 145 పరుగులు తేడాతో విజయం సాధించింది అంటూ తెలిపారు. అంతే కాకుండా భారత్ తుది జట్టు ఎంపిక కూడా సరిగ్గా లేదు అంటూ స్టివ్ వా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: