సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపులారిటీ సెలబ్రిటీలకు ఏ రేంజ్ లో గుర్తింపు లభిస్తుందో అంతకుమించి అసభ్యకరమైన పోస్టులు, ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. " అయితే ఇలా సెలబ్రిటీలపై ట్రోలింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు తీసుకొని చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు హైదరాబాదు క్రైమ్ డిసిపి స్నేహ మెహర." ఇదే పోస్టును అనసూయ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

ఇక అసలు విషయంలోకెళితే గత కొద్ది రోజుల క్రితం అనసూయ ఆంటీ వివాదం ఎలా వైరల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు.  ముఖ్యంగా ఆమెను కొంతమంది ఆంటీ అని ఆకతాయిలు హేళన చేశారని పోలీస్ కేసు పెడతాను అంటూ కూడా ఆమె హడావిడి చేసింది. అంతేకాదు కొంతమంది ఆంటీ అంటున్నారని సైబర్ కంట్రోల్లో కూడా కంప్లైంట్ చేసింది అనసూయ.  దాంతో కొద్దిరోజుల ఈ ఆంటీ హడావిడి కాస్త తగ్గింది.. అంతేకాదు పెళ్లయి పిల్లలు ఉండి అంత ఏజ్ వున్న  అనసూయను ఆంటీ అనే అంటారు అంటూ కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల సోషల్ మీడియాలో ప్రముఖులపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇది అనసూయకు కాస్త రివర్స్ అయ్యింది. ఈ పోస్ట్ పెట్టడంతో మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టవచ్చు.. మేము ఆంటీ అంటే తప్పా.. ఇది మీలాంటి వాళ్లకు కాదు.. అలా అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే వారిని చెడగొడుతున్నారు అంటూ అనసూయ పోస్ట్ కు చాలా మంది నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది మరొకసారి ఆంటీ.. ఆంటీ అంటూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. కొంతమంది ఆంటీ అంటే అసభ్యకరంగా మిమ్మల్ని తిట్టినట్టా అని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు.  మరొకసారి ట్విట్టర్లో ఆంటీ , అనసూయ అనే పదాలను ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఏమైనా అలాంటి పోస్ట్ పెట్టి మళ్ళీ ఆంటీ అనిపించుకుంటుంది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: