మనుషులకు మల్లే చేపలు కూడా తమ పళ్ళను శుభ్రం చేసుకుంటాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే చేపలు పళ్ళు తోముకోవడానికి అసిస్టెంట్లను నియమించుకుంటాయి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్షరాలా వాస్తవం. మిమిక్స్ అని పిలవబడే ఇతర జాతులకు చెందిన చిన్న చేపలు తమకి తాముగా పెద్ద చేపలకు సేవలు చేస్తాయి. ఎలా అంటే పెద్ద పెద్ద చేపలు నోరు తెరిచినప్పుడు వాటి నోటిలో పళ్ళచుట్టూ పేరుకుపోయిన బాక్టీరియా, ఫంగస్, నాచు వంటి వాటిని తింటూ క్లీన్ చేస్తాయి. అందుకే వాటిని "క్లీనర్ ఫిషెస్" అని కూడా అంటారు. ఇవి స్వతహాగా సేవ చేస్తాయి కాబట్టి, వీటిపై ఇతర జాతుల చేపలు దాడి చేయవు. ఈ క్లీనర్ ఫిషెస్ వచ్చినపుడు మిగతా చేపలు తమంతట తామే స్వయంగా నోరు తెరిచి మరీ ఉంచుతాయి.

క్లీనర్ ఫిష్ అని పిలవబడే ఈ జీవులు ప్రకృతిలో చాలా ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఈ చిన్న చేపలు పెద్ద చేపల చర్మం నుండి, నోటి నుండి పరాన్నజీవులను తింటూ జీవనం కొనసాగుతాయి. వాటికి తెలియ కుండానే అవి మిగతా చేపలకు చాలా మేలు చేకూరుస్తాయి. సుపరిచితమైన రెండు జాతుల మధ్య అనుబంధానికి ఉదాహరణగా ఈ విషయాన్ని పేర్కొనవచ్చు. ఇక్కడ ఒక జీవి శరీరం నుండి ఎక్టోపరాసైట్‌లను తొలగించడం ద్వారా మరొక జీవి శుభ్ర పడుతుంది. కాగా ఇటువంటి క్లీనింగ్ మ్యూచువలిజం మరింత విస్తృతమైన వ్యవస్థ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక క్లీనర్ ఫిషెస్ వలన వివిధ చేప జాతులు తమ శరీరాలపై మోసే అత్యంత సాధారణ ఎక్టోపరాసైట్‌లు ఐసోపాడ్‌లు, ఇతరత్రా సముద్ర జంతువులనుండి రక్షణ పొందుతాయి. అందుకే ఆయా చేపజాతులను క్లయింట్స్ గా అభివర్ణిస్తారు. ఇక బ్లూస్ట్రీక్ క్లీనర్ గా చెప్పుకోబడే ఈ చేపలు అనేక రకాల క్లయింట్‌లను శుభ్రపరుస్తాయి. స్విట్జర్లాండ్‌లోని యూనివర్శిటీ డి న్యూచాటెల్‌లో ఎకాలజీ మరియు ఎథాలజీ ప్రొఫెసర్ అయిన "రెడౌవాన్ బ్షారీ" మరియు అతని విద్యార్థులు మరియు సహచరులు చేసిన అనేక సంవత్సరాల అధ్యయనాల నుండి ఈ పరస్పర సంఘం యొక్క జీవావరణ శాస్త్రం మరియు పరిణామం గురించి ఈ రోజు మనం తెలుసుకోగలుగుతున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: