గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 2వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు.
2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

ప్ర‌ముఖుల జననాలు..

1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969).ఈయన తూర్పు గోదావరి జిల్లా లోని జమీందారీ కుంటుంబంలో ఏప్రిల్ 2, 1915 న జన్మించారు. ఆయన బాల్యమంతా భీమడోలు యందు గల తాతగారింట్లో గడిచింది. ఆయన బాల్యంలో గ్రామఫోన్ ముందు కూర్చుని ఆ పాటలను శ్రద్ధగా వింటూండేవాడు. ఆయన రాజమండ్రిలో ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు "మాచిరాజు రామచంద్ర మూర్తి" గారి "కేసరి సమాజం"లో చేరారు. అచట రంగస్థలం పై నటనను ప్రారంభించారు. ఆయన చింతామణి , " ప్రతాపరుద్రీయం" వంటి నాటకాలలో నటించి వచ్చిన సొమ్మును పాఠశాలలకు గ్రంథాలయాలకు విరాళంగా యిచ్చేవారు.
1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్

ప్ర‌ముఖుల మరణాలు..


1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791) ప్ర్రతికృతి చిత్రకారుడిగా తన ఖ్యాతిని స్థాపించిన తరువాత, తన మధ్య వయస్సులో మోర్స్ యూరోపియన్ టెలిగ్రాఫ్‌ల ఆధారంగా సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టాడు. అతను మోర్స్ కోడ్ సహ-అభివృద్ధికారుడు, టెలిగ్రాఫీ వాణిజ్య వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాడు.
1933: మహారాజా రంజిత్‌ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)

పండుగలు , జాతీయ దినాలు

పోలీస్ పతాక దినం.
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
ప్రపంచ ఆటిజం అవగాహన డే.

మరింత సమాచారం తెలుసుకోండి: