
ఎట్టకేలకు శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మించిన సినిమా ఆగడు.. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించగా, శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించింది. ఇక తమన్నా హీరోయిన్ గా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు నటించారు. ఇందులో మహేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా మనకు కనిపిస్తారు. సెప్టెంబర్ 19 2014 వ సంవత్సరం విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమాను 55 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 34.36 కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.. మొత్తంగా నిర్మాతలకు 21 కోట్ల రూపాయల లాస్ కూడా వచ్చింది.. తాడిపత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ..కాని కథ పరంగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది అని చెప్పవచ్చు.