
ఇప్పుడు బ్యాట్మెంటన్ క్రీడాకారిని గుప్తా జ్వాల సమంతను టార్గెట్ చేయడం జరిగింది. సమంత సూచించిన ట్రీట్మెంట్ పద్ధతి చాలా ప్రాణాంతకరమైన ఫలితాలను ఇస్తుంది అంటూ జ్వాలా గుప్త ప్రశ్నించారు. మీకు సహాయం చేయాలని ఉద్దేశం ఉంటే నేను నమ్ముతున్నాను .. కానీ మీకు తెలిసినట్టుగా రెసిపీ పని చేయకపోతే దానికి ఏదైనా ప్రాణాంతక సంఘటన జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా అంటూ ట్యాగ్ చేసిన డాక్టర్ను కూడా బాధ్యత వహిస్తారా అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది.
అయితే ఈ విషయం పైన హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా దేన్ని అయినా అడ్వర్టైజ్ చేయవచ్చు.. అందుకు ఉదాహరణ ఇదే అంటూ తెలిపారు. చాలామంది ప్రముఖులు చక్కెర తీసుకోరు కానీ వారు తీసుకొని చక్కెర ఉన్న పానీయాలు మరియు చాక్లెట్లు గురించి ప్రమోషన్స్ మాత్రమే చేస్తూ ఉంటారని ఇదంతా డార్క్ రియాలిటీ అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఇందుకు సమంత ఏ విధంగా రిప్లై ఇస్తుందో చూడాలి మరి.