జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో.  అయినా సరే ఆయన నటన కన్నా కూడా ఆయన డాన్సింగ్ స్టైల్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు జనాలు . ఈ విషయాన్ని చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు . జూనియర్ ఎన్టీఆర్ అందంగా ఉంటాడు.. హ్యాండ్సమ్ లుక్స్ లో మెప్పిస్తాడు. అంతేకాదు సినిమా కోసం ఎలాంటి భారీ రిస్కీ పనులైన చేస్తాడు.  అంతేనా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది . కానీ ఇవన్నీటికన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్టైల్ వేరే లెవెల్ .


ఈ విషయం ఒకరు ఇద్దరు కాదు వేలలోనే జనాలు ఓపెన్గా చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా ఆయనతో వర్క్ చేసే కొరియోగ్రాఫర్స్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత పాజిటివ్ గా చెప్పుకొస్తూ ఉంటారో అందరికి తెలిసిందే. ఎంత హార్ట్ స్టెప్స్ ఇచ్చినా కూడా సింగిల్ టేక్ లోనే ఓకే చేస్తాడు అని.. అలా ఆయన డాన్స్ చేసి మమ్మల్ని షాకింగ్ కి గురి చేస్తాడు అని.. ఒక డాన్స్ స్టెప్ చేయడానికి మేము 10 రోజుల కష్టపడితే ఆయన ఒకే ఒక్క టేక్ తీసుకొని దాని ఫైనలైజ్ చేసేస్తాడు అని .. ఇది నిజంగా ఎన్టీఆర్ కి ఉన్న బిగ్ స్పెషల్ టాలెంట్ అని చాలామంది కొరియోగ్రాఫర్స్ చెప్పుకొచ్చారు .



అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి ఫేవరెట్ హీరో డ్యాన్స్ ఎవరిది అనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. కాగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ కి మెగాస్టార్ చిరంజీవి డాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొస్తుంటే ..మరి కొందరు మాత్రం కాదు కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టమని.. పరోక్షకంగా చాలా సందర్భాలలో ఆ విషయాని బయటపెట్టారు అని గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆయన అల్లు అర్జున్ డాన్సింగ్ స్టైల్ వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చారు . అలా చూసుకున్న సరే బన్నీ డాన్స్ అంటే తారక్ కి మహా మహా ఇష్టమని చెప్పేసేయొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: