
క్రియేటిక్ డైరెక్టర్ కృష్ణ వంశీ, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో 24 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా మురారి. ఈ సినిమాతోనే అప్పట్లో బాలీవుడ్‌ను ఊపేస్తోన్న సోనాలి బింద్రే తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. నేచురల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలై పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ సోనాలి బింద్రేను చాలా అందంగా చూపించారు. వంశీ లాంటి అతి పెద్ద డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చిన మురారి మహేష్ బాబు కెరీర్‌లో ఓ మంచి సినిమా గా.. అందమైన సినిమా గా నిలిచిపోయింది.
మురారి మూవీతో మహేష్ బాబు ఇటు అభిమానులతో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత చేరువ అయ్యాడు. ఈ సినిమాను గత యేడాది రీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రీ రిలీజ్ లో తొలిరోజు వరల్డ్ వైడ్‌గా మురారి రూ. 5.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించ డంతో ట్రేడ్ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఇప్పటి వరకు తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమా లలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా గా మురారి రికార్డులకు ఎక్కేసింది.
వాస్తవంగా ఈ సినిమా ను మహేష్ బాబు కన్నా ముందు చేయాల్సిన హీరో మరొకరు ఉన్నారు. ఆ హీరో ఎవరో ? కాదు అక్కినేని హీరో సుమంత్ యార్లగడ్డ. నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్ నుంచే కృష్ణవంశీ, నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ టైంలో మురారి కథను కృష్ణ వంశీ ముందుగా నాగార్జునకు వినిపించడం ... ఆ కథ బాగా నచ్చడంలో మురారి సినిమాను తన మేనల్లుడు సుమంత్ తో తీయమని నాగార్జున అడిగారట. కృష్ణ వంశీ మాత్రం ఆ కథ కు మీరు లేదా మహేష్ బాబు మాత్రమే సూట్ అవుతారని చెప్పడం.. నాగ్ అప్పుడు బిజీగా ఉండడంతో చివరకు మహేష్‌తో సినిమా తీసి హిట్ కొట్టారు.